రాజమండ్రిలోని రాజా థియేటర్ రోడ్డులో బ్రదర్స్ చర్చ్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీనికి సమీపంలో ఉన్న ఆటో కూడా కిందపడిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతూ, ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.