రాష్ట్ర వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (CEC) సభ్యుడిగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావును నియమించారు. ఈ నియామకంపై ఆయన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తో కలిసి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం రామ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.