అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత

1చూసినవారు
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతను అందిస్తున్నాయని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని 11వ డివిజన్‌లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా తీసుకుని ఎన్టీఆర్ భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.