తూ. గో జిల్లాలో చేనేత రంగాభివృద్ధి, ఎగుమతుల పెంపు కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో జిల్లా ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికపై అధికారులు, చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ గుర్తింపు వచ్చేలా ప్రత్యేక బ్రాండింగ్ చేపట్టాలని సూచించారు.