నేరాల నియంత్రణకు డ్రోన్లతో పటిష్టమైన నిఘా చర్యలు

1చూసినవారు
నేరాల నియంత్రణకు డ్రోన్లతో పటిష్టమైన నిఘా చర్యలు
తూ. గో. జిల్లాలో ప్రజా భద్రతను కట్టుదిట్టం చేసి, నేరాలను నియంత్రించే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ ఆధారిత 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థం గల ప్రాంతాలు, జాతరలు, నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ఈ డ్రోన్లు పంపే ప్రత్యక్ష దృశ్యాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించబడి ఉండటంతో, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వెంటనే స్పందించేందుకు వీలు కలుగుతుంది.

ట్యాగ్స్ :