
భారత్ పర్యటనకు ట్రంప్ కుమార్తె!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. శుక్రవారం భారత్ చేరుకున్న ఆమె, ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించి, అందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆదివారం ఆమె తాజ్‌మహల్‌ను సందర్శించనున్నట్లు సమాచారం.




