రాజమండ్రి నగర కీర్తిని మరింత ఇనుమడింప చేయాలి

8చూసినవారు
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారుడు అర్జి బాలకృష్ణకు ఆర్థిక సహాయం అందించారు. టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించిన బాలకృష్ణ, హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే, తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ. 25,000 అందజేశారు. బాలకృష్ణ విజయం రాజమండ్రి ప్రజలకు గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్