మే 30తో ఇండ్ల గణన ప్రక్రియ ముగింపు

5చూసినవారు
మే 30తో ఇండ్ల గణన ప్రక్రియ ముగింపు
భారతదేశ జనాభా గణన–2027లో భాగంగా జరుగుతున్న తొలి దశ “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” ప్రక్రియ రాష్ట్రంలో మే 30వ తేదీతో ముగియనుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో ప్రతి కుటుంబం తమ ఇంటి వివరాలు జనాభా గణనలో నమోదు అయ్యేలా తప్పనిసరిగా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇంకా ఇంటి వివరాలు నమోదు కాకపోయి ఉంటే వెంటనే స్పందించి జనాభా గణన అధికారులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ప్రజల సహకారం అత్యంత ఆవశ్యకమని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్