తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తున్న పులి వివరాలను అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఇది నాలుగేళ్ల వయస్సు, 200 కేజీల బరువున్న మగ పులి అని గుర్తించారు. మనుషులపై దాడి చేయకపోయినా, పశువులను హతమారుస్తోందని తెలిపారు. పులిని పట్టుకోవడానికి రెండు బోన్లు, 15 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇది ఆహారం లేకుండా వారం రోజుల వరకు ఉండగలదని, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.