అనపర్తిలో విషాదం

0చూసినవారు
అనపర్తిలో విషాదం
అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన ఆరు నెలల సిద్ధార్థ అనే చిన్నారి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందాడు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు దాతలు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో అమ్మమ్మ కాలేయం దానం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే ఇంటికి క్షేమంగా వస్తాడని ఆశించిన తరుణంలో ఊహించని విధంగా చిన్నారి మరణించడంతో పొలమూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.