ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు

8చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ, పీ.జీ. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ఎంకేఎస్ ప్రసాద్ కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించారు.