కార్మికులే శక్తి... వారి కోసం ఎప్పుడూ ముందుంటాం

598చూసినవారు
కార్మికులే శక్తి... వారి కోసం ఎప్పుడూ ముందుంటాం
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మే డే రోజున కార్మికుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిన సంకల్ప దినంగా అభివర్ణించారు. శుక్రవారం రాజమండ్రిలోని కంబాల చెరువు వద్ద జరిగిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, కార్మికులే దేశానికి వెన్నెముక అని, వారి శ్రమతోనే సమాజం నిలబడుతుందని అన్నారు. కార్మికుల హక్కుల కోసం టీఎన్టీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని, కార్మికులను గౌరవించని ప్రభుత్వాలు నిలవవని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్