గోకవరం మండలం తంతికొండకు చెందిన కామిటెట్టి పప్పు భగవాన్ (35) గురువారం కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు గోకవరం SI పసున్ కుమార్ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.