రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'మెగా డీఎస్సీ'లో భారీ అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి, జిల్లా
వైసీపీ ఇన్చార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో
వైసీపీ ఆధ్వర్యంలో 'దగా డీఎస్సీ పై YSRCP విద్యార్థి పోరు' పేరుతో నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో భాగమైన ఓ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది మెగా డీఎస్సీ కాదని 'దగా డీఎస్సీ' అని ఆయన మండిపడ్డారు.