తూ. గో జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో మొత్తం 190 అర్జీలు స్వీకరించబడినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి.
సీతారామ మూర్తి తెలిపారు. ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడం ప్రభుత్వ లక్ష్యమన
ి, ప్రతి అర్జీని సమగ్రంగా
పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులందరూ నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ప్రతి అర్జీదారునికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి గడువులు పాటించాలని తెలిపారు.