రాజమండ్రి నుంచి వెళ్లిన బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

1చూసినవారు
రాజమండ్రి నుంచి వెళ్లిన బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
విశాఖపట్నంలోని శ్రీనగర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్