రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గురువారం రాజమండ్రి రూరల్ 16వ వార్డులో వాటర్ ఫిల్టర్ బహుకరించి, టీబీ రోగులకు పౌష్టికాహారం కోసం రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.