గోకవరం మండలం కొత్తపల్లి మేజర్ గ్రామపంచాయతీలో శుక్రవారం రాత్రి మురికి కాలువలో పడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువలపై సిమెంట్ మూతలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలుడి పరిస్థితిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.