హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుంది

3చూసినవారు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. గురువారం కడియం దేవిచౌక్‌ సెంటర్ వద్ద చంద్రబాబు పాలన 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం హామీల పాంప్లెట్లను తగులబెట్టి, చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వెంకటస్వామినాయుడు, బాబు, స్టాలిన్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్