రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు అంగన్వాడి కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా సందర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా–శిశు సంక్షేమ శాఖల సయోధ్య కార్యక్రమాల అమలుపై ఆమె సమగ్రంగా సమీక్షించారు. ఆరోగ్య సేవల నాణ్యత, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ, వైద్య పరీక్షలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సిబ్బందికి కలెక్టర్ సూచనలు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే. వెంకటేశ్వరరావు కూడా ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఉన్నారు.