డైట్‌లో డిప్యూటేషన్ నియామకాల గడువు ఈ నెల 3 వరకు పొడిగింపు

0చూసినవారు
డైట్‌లో డిప్యూటేషన్ నియామకాల గడువు ఈ నెల 3 వరకు పొడిగింపు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని డైట్‌లో డిప్యూటేషన్ విధానంలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును ఈ నెల 3వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి పిల్లి రమేష్ వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్లుగా కనీసం ఐదేళ్ల సేవా అనుభవం కలిగి, వయస్సు 58 ఏళ్లకు మించని ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా సంబంధిత ఎంఈవో కార్యాలయాల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.