ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, కోటిపల్లి బస్టాండ్, గామన్ బ్రిడ్జి, దివాన్ చెరువు జీరో పాయింట్, మోరంపూడి జంక్షన్ వంటి ముఖ్య కూడళ్లలో ఈ తనిఖీలు జరిగాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పాటు పోలీసు బృందాలు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాయి.