గిరిజన, బీసీ వసతి గృహాలకు 200 దోమ తెరల పంపిణీ

686చూసినవారు
గిరిజన, బీసీ వసతి గృహాలకు 200 దోమ తెరల పంపిణీ
రూరల్ నియోజకవర్గంలోని గిరిజన, బీసీ, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 200 దోమ తెరలను పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఫైర్ స్టేషన్ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో 50 మంది బాలికలకు దోమ తెరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ, వసతి గృహాల్లో వసతి, భోజనం, ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్