జిల్లాలో రేషన్ కార్డు సభ్యుల ఈ-కేవైసీ 98. 71 శాతం పూర్తి

6చూసినవారు
తూర్పు గోదావరి జిల్లాలో రేషన్ కార్డు సభ్యుల ఈ-కేవైసీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 6,52,000 రేషన్ కార్డులు, 18,35,000 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. వీరిలో 17,91,000 మంది సభ్యులు ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని, ఇది మొత్తం లబ్ధిదారుల్లో 98.71 శాతమని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్