రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ వై. మేఘా స్వరూప్ 178 అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించడం తప్పనిసరి అని, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియలో సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారులు పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆదేశించారు.