రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు పైకెత్తి 10.01 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలవలకు 11,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.