కడియంలోని శ్రీ ఆదిత్య పాఠశాలకు చెందిన గెద్దాడ చరణ్ రత్న సందీప్ గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులు సాధించి మండలం టాపర్‌గా నిలిచారు. పాఠశాల కరస్పాండెంట్ బైరిశెట్టి రామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,
విద్యార్థులు చరణ్ రత్న సందీప్‌ను అభినందించారు. భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.