కడియం మండలం దుళ్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు దశకు చేరుకుంది. ముగింపు రోజైన బుధవారం రైతు సేవా కేంద్రంలో రైతు-శాస్త్రవేత్తల చర్చా గోష్టి ఆసక్తికరంగా సాగింది. ఈ సదస్సులో శాస్త్రవేత్త బి. సహదేవరెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. మల్లిఖార్జునరావులు రైతుల సందేహాలను నివృత్తి చేశారు.