కడియం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

8చూసినవారు
కడియం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా SKVT హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వైకల్యాన్ని జయించి పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన కడియం పల్ల వెంకన్న 90వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. పల్ల వెంకన్న ఆదర్శప్రాయుడని విద్యార్థులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్