మంగళవారం కడియం దేవి సెంటర్ లో ట్రాఫిక్ నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కడియం సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.