కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్ సమక్షంలో సుమారు రూ.7 లక్షలు విలువైన ఐదు కాసుల బంగారు ఆభరణాన్ని బాధితురాలు సయ్యద్ ఫాసియ ఫిరోజ్కు అందజేశారు. ఈ నెల 4న కొవ్వూరులో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిన ఫిరోజ్ బంధువుల ఇంట్లో ఆభరణం కనిపించలేదు. కోటిపల్లి బస్టాండు సమీపంలో వెతుకుతుండగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ డి. రమేష్ బాబు, అతని బావమరిది మహేష్కుమార్కు ఆ ఆభరణం దొరికింది. సీఐ పి.విశ్వం చొరవతో డీఎస్పీ దేవకుమార్ వీరిని అభినందించారు. ఫిరోజ్, ఆమె బంధువులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.