క్విజ్ పోటీలలో మాధవరాయుడి పాలెం విద్యార్థికి ప్రథమ స్థానం

9చూసినవారు
క్విజ్ పోటీలలో మాధవరాయుడి పాలెం విద్యార్థికి ప్రథమ స్థానం
కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామానికి చెందిన చైతన్య నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ కౌశల్, జిల్లా స్థాయి సైన్స్ క్విజ్‌లో ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం, గ్రామ సర్పంచ్ అన్నదేవుల వీర వెంకట సత్యనారాయణ విద్యార్థికి సైన్స్ పుస్తకాన్ని, మెమొంటోను బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని మధిర వెంకట కృష్ణ కామేశ్వరితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్