విజయవాడలోని గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్‌లో మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డైరెక్టర్లు మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లి, వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు యానాపు ఏసు, ఎం. శివ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.