మంత్రి లోకేష్ ఉగ్ర నరసింహం: ఎమ్మెల్యే గోరంట్ల

7చూసినవారు
మంత్రి నారా లోకేశ్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ దేశానికే దిక్సూచిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, పులి కడుపున పులే పుట్టిందని, పెద్ద పులి సాధువు అయితే, చిన్న పులి ఉగ్ర నరసింహం అని ఆయన అభివర్ణించారు. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకు గొడ్డలి పార్టీ పరారవుతుందని అన్నారు. తెలుగు జాతి ఐక్యత కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని మహానాడులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్