కడియం మండలం బుర్రిలంక గ్రామంలో గురువారం
టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం,
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ మాట్లాడుతూ,
ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత అని కొనియాడారు.