మాజీ మంత్రి, రూరల్ వైసీపీ ఇన్చార్జ్ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడిందని, ఇది కృత్రిమ కొరత అని విమర్శించారు. మూడు రోజులుగా ఈ సమస్య తీవ్రమైందని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆయన అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు వద్ద నిరసన చేపట్టారు.