గాంధీజీ మెచ్చిన రాజమండ్రి 'రత్నం'

2చూసినవారు
గాంధీజీ మెచ్చిన రాజమండ్రి 'రత్నం'
స్వదేశీ ఉద్యమ సమయంలో రాజమండ్రికి చెందిన కేవీ రత్నం తయారు చేసిన 'రత్నం పెన్'ను మహాత్మా గాంధీ ఎంతో ప్రశంసించారు. విదేశీ వస్తువుల బహిష్కరణ సమయంలో, స్వదేశంలో తయారైన ఈ ఫౌంటెన్ పెన్నును చూసి ఆయన ఆనందపడ్డారు. దీని విశిష్టతను కొనియాడుతూ గాంధీజీ రత్నంకు లేఖ కూడా రాశారు. నేటికీ ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

సంబంధిత పోస్ట్