RJY RURAL: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

1చూసినవారు
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద రబీ పంటకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు కాలువలను, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బండారు సత్యనందరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్