రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ఘనత సాధించారని కొనియాడారు. జగన్ హయాంలో రూ. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చినా అభివృద్ధిని గాలికొదిలేశారని ఆయన విమర్శించారు.