రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రూ. 2 కోట్ల 25 లక్షలతో ఈ ఆధునాతన కేంద్రం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలను బలోపేతం చేస్తూ, అవసరమైన అగ్నిమాపక పరికరాలు, యంత్రాలను సమకూర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు.