కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి వైపు నుంచి వస్తున్న ట్యాంకర్, హైవేను దాటుతున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కడియం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.