ఆర్టీసీ అధికారులు వెంటనే విద్యార్థులు వెతలు తీర్చాలి

5చూసినవారు
కడియంలో ఆర్టీసీ బస్సులు సమయానికి ఆగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల కోసం పరుగులు తీస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఆయన శనివారం ఆర్టీసీ డిఎం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్