రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సెంటర్ నుండి బాలాజీ పేట వెళ్లే ప్రధాన రహదారిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంగళవారం రాజమండ్రి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ మత్సేటి శివసత్య ప్రసాద్ పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పని చేసి పట్టణ పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీమరశెట్టి రమేష్, పితాని రాజు, AMG శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.