రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శుక్రవారం రాజవోలు గ్రామంలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని ఆయన స్పష్టం చేశారు.