తూ. గో జిల్లాలో 2, 70, 496 మంది పింఛన్ లబ్ధిదారులు

4చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన 2,70,496 మంది లబ్ధిదారులకు రూ. 118 కోట్ల 61 లక్షల 43 వేల 500 మొత్తాన్ని పంపిణీ చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శనివారం రాజమండ్రిలో పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేశారు. జిల్లాలో మధ్యాహ్నం వరకు 2,37,235 మందికి (87.70%) రూ. 103 కోట్ల 81 లక్షల మేర నగదు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్