తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు తెలంగాణలో నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడగా, అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ నెల 15న ఒక వ్యాపారికి నకిలీ నోట్లు ఇచ్చి సోఫా కొనుగోలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 11 నకిలీ నోట్లు, సెల్‌ఫోన్లు, సోఫాను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.