ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు దినం కావడంతో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జనవరి 31న, ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జిల్లాలోని 2.71 లక్షల మంది లబ్ధిదారులకు రూ.118.64 కోట్లను నేరుగా ఇంటి వద్దకే అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పంపిణీ ప్రక్రియ కోసం 4,600 మంది అధికారులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.