ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని బాధితురాలు కోరగా నిందితుడు నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI సురేశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.