జిల్లా గనులు & భూగర్భ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గనులు & భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారుల సంయుక్త బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో భాగంగా కాతేరు సమీపంలో అక్రమంగా నిలిపి ఉంచిన రెండు డ్రెడ్జింగ్ పడవలను సీజ్ చేశారు. బ్రిడ్జిలకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో ఎటువంటి ఇసుక తవ్వకాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.