రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

4చూసినవారు
రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
రాజమహేంద్రవరం జీఆర్పీ ఇన్స్పెక్టర్ వై. వి. రమణ, హెచ్సీ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం, కడియం రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు రైలు ఢీకొని మృతి చెందారు. సుమారు 25-30 ఏళ్ల వయసున్న, 5.5 అడుగుల ఎత్తు గల మృతుడి ఎడమ చేతిపై 'రమ' అనే పచ్చబొట్టు ఉంది. పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 944 077 9249, 0883-2442821 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్